header

Saint Kitts and Nevis…సెయింట్ కిట్స్ – నెవిస్

Saint Kitts and Nevis…సెయింట్ కిట్స్ – నెవిస్

ఈ దేశం కరేబియన్ సముద్రంలో ఉన్న రెండు చిన్న దీవులు. జనభా పరంగా, వైశాల్యం పరంగా ఉత్తర అమెరికాలో చిన్నవి. 1493 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దీవుల ఉనికిని కనిపెట్టాడు.
1623 సంవత్సరంలో ఇంగ్లీష్ వారు ఈ దీవులలో ప్రవేశించి దీనిని బ్రిటీష్ కాలనీగా మార్చారు. కరేబియన్ దీవులలో మొదటి బ్రిటీష్ కాలనీ ఇదే. తరువాత ఈ దీవుల మీద ఆదిపత్యం కోసం బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వారి మద్య చాలా సంవత్సరాల పాటు ఖర్షణ జరిగింది. కానీ ఈ దీవుల మీద బ్రిటీష్ వారి ఆధిపత్యం కొనసాగింది. చివరకు 1983 సంవత్సరంలో ఈ దీవులు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నాయి.
ఈ దేశ విస్తీర్ణం269 చ.కి.మీ. రాజధాని బస్సే-టెర్రే. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రోజాతికి చెందినవారు 90 శాతం మంది ఉన్నారు. భారతీయులు 3 శాతం మంది, సంకరజాతులు 5 శాతం మంది ఉన్నారు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. 76 శాతం మంది క్రైస్తవాన్ని అనుసరిస్తారు. వీరి కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్.
చెరకు, కొబ్బరి, పండ్లు, వేరుశెనగ, చేమదుంపలు, వరి,అరటి, ప్రత్తి పంటలను సాగుచేస్తారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమలు కలవు. పంచదార, మొలాసిస్ ముఖ్యమైన పరిశ్రమలు. వ్యవసాయ యోగ్యమైన భూములు కలవు.